ఓం శ్రీ మహాగణపతయే నమః
పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాగ్జోతిషపురముు అనే నగరాన్ని పరిపాలించేవాడు. నరకాసుడు వరాహ అవతారం లో ఉన్న విష్ణుమూర్తికి, భూదేవికి కలిగిన సంతానం. నరకాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయి నరకాసురుడి కి నీకు ఏమి వరం కావాలి అని అడగ్గా తనకు మరణం లేకుండా వరం కావాలని అడుగుతాడు. ఆ వరం అసాధ్యం అని అంటాడు శివుడు కానీ నరకుడు అదే పట్టుదలతో ఆ వరమే కావాలని అంటాడు. అప్పుడు శివుడు నిన్ను కన్న తల్లి చేతిలోనే తప్ప ఇంకెవరు నిన్ను చంపజాలరూ అని వరమిస్తాడు. ఆ వరగర్వంతో నరకుడు కన్న తల్లి ఎక్కడైనా తన బిడ్డను చంపదు కదా నాకు ఇంకా మరణం లేదు అని భావించి దేవలోకం పైన దండెత్తుతాడు. దేవలోకంలోని దేవతలను అప్సర కాంతలను, అదితి కర్ణ కుండలాలను తీసుకొని తన నగరానికి తిరిగి వస్తాడు. భూలోకంలోని మునులను, మునికాంతలను కూడా బాధించేవాడు. ఇతను తన నగరంలో ఉన్న విష్ణుభక్తుడైన నాగ దత్తుని కుమార్తె అయిన వసుమతిని మోసంతో వివాహం చేసుకొని నాగ దత్తుని చెరసాలలో బంధిస్తాడు. ఈ నరకుని బాధలు భరించలేక దేవతలు, మునులు నారదుడు అందరూ శ్రీకృష్ణుని ఆశ్రయిస్తారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళ బాధలు తొలగిస్తానని అభయమిచ్చి పంపుతాడు. తరువాత నారదుని రాయబారిగా నరకుని వద్దకు పంపిస్తాడు. ఆ రాయబారం విఫలం అవుతుంది. ఆ రాయబారం విఫలం అవ్వటం వల్ల సత్యభామ సమేతుడై కృష్ణుడు నరకుని పై సమరానికి బయలుదేరుతాడు. యుద్ధంలో నరకుని బాణానికి మూర్ఛ లిల్లీ నట్లు నా నటిస్తూ కృష్ణుడు పడిపోతాడు. అప్పుడు సత్యభామ కోపోద్రేకంతో బాణాలు వేయగా ఆమె బాణాలు శర పరంపరకు నరకుడు మరణిస్తాడు. శివుని వరం ప్రకారం నరకుడు తల్లి చేతిలోని మరణిస్తాడు. భూదేవే సత్యభామ. నరకుడు చనిపోయిన రోజున ప్రజలంతా దీపాలు వెలిగించి నగరమంతా దీపాల వెలుగులు నింపుతారు. అదే మనమందరం జరుపుకునే దీపావళి పండుగ. దీపావళి అంటే దీపాల వెలుగు.
కార్తీక మాస మహత్యం:- సంవత్సరంలోని అన్ని మాసాలకన్నా కార్తీకమాసం చాలా గొప్ప విశిష్టత కలిగినది. అది ఎందుకనగా కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ వ్రతమున, ఏ దానమైన చేయటం వల్ల కలిగే ప్రతిఫలం ఎంతో గొప్పగా ఉంటుంది. సకల ఐశ్వర్యములు కలుగ జేసే మాసమిది. అందరు మానవులు కులమత భేదములులేక, శాస్త్ర సమ్మతమైన, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించే వ్రతాలు ఈ మాసంలో చేసేవి. వ్రతాలు ఏమి చేయలేక పోయినా విష్ణు సహస్రనామం గాని, శివార్చన, కార్తీక పురాణం, దేనిని విన్నా కూడా ఎంతో ఆనందదాయకం.
ఈ వ్రతం చేసే వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానమాచరించి ఈ కార్తీక మాసమునకు ఆదిదేవుడు అగు దామోదరుని మనసార ధ్యానం చేసి " ఓ దామోదరా ! నేను చేసే ఈ కార్తీక స్నాన, దీపారాధనకు ఏ ఆటంకము రానీయక నన్ను కాపాడుము అని స్మరించుకోవాలి." కార్తీక మాసంలో సోమవారం చాలా ప్రాముఖ్యం కలిగింది. కార్తీక సోమవారం శివునికి చాలా ఇష్టమైన రోజు. సోమవారం నాడు స్త్రీ గాని పురుషుడు గానీ ఏ జాతి వారైనా, రోజంతా ఉపవాసం ఉండి బిల్వ పత్రాలతో శివుని పూజించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను పూజించవలయును. కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు శివుని పూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణువును పూజిస్తే, వైకుంఠ ప్రాప్తి కలుగును. అమావాస్య వెళ్లిన మరుసటి రోజు ఈసారి సోమవారం వచ్చింది. చాలా ముఖ్యమైన, పవిత్రమైన రోజు సార్థకం చేసుకొని ఆ శివుని అనుగ్రహాన్ని అందరూ పొందుతారని ఆశిస్తున్నాను. ఎవరైనా కొందరు ఆరోగ్యం బాగోలేక, పరిస్థితులు అనుకూలించకపోతే దిగులు పడవద్దు. ఇంట్లోనే దీపం వెలిగించి విష్ణుసహస్రనామం చదవండి. పాలు, పంచదార, ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి చాలు. ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది.
ఆ శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యము ఇచ్చి ఆనందింపచేస్తాడు.
సకలం శ్రీమన్నారాయణయేతి సమర్పయామి !!!
ఈ వారం చిట్కా:-
నల్ల మచ్చలు చర్మ వ్యాధుల నివారణ:- గోధుమ పిండిని జల్లెడ పడితే గోధుమ పొట్టు వస్తుంది. ఈ గోధుమ పొట్టులో పెసర పిండిని కలిపి స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా శరీరానికి రుద్దుకుంటే మచ్చలు చర్మ వ్యాధులు అన్నీ తగ్గుతాయి.


ConversionConversion EmoticonEmoticon