రాహుకాల దోషం తొలగడానికి......


గ్రహదోషాల గురించి అందరూ విని ఉంటారు. అవి తొలగించుకోవటానికి రకరకాల పూజలు చేస్తుంటారు. వాటిలో ముఖ్యమయినది రాహుకాల దోషం. 

ఈ రాహుకాల దోషం  తొలగిపోవటానికి నాకు తెలసిన ఒక పద్ధతిని మీకందరికీ తెలియజేస్తున్నాను.

ఇది 41 రోజులు చేయవలసిన దీపారాధన. దీనిని రాహుకాల సమయంలో చెయ్యాలి. దీనిని " రాహుకాల దీపారాధన " అంటారు. 

రాహుకాల సమయం ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కో రోజు ఒక్కో సమయంలో ఉంటుంది. ఆ సమయాలను అనుసరించి దీపారాధన చేయాలి. 

అదీగాక ఇంటి  గడియారాలలో సమయం ఒక్కో ఇంట్లో ఒక్కో విధముగా ఉంటుంది. కొన్ని గడియారములు ఫాస్ట్ గా, కొన్ని స్లోగా తిరుగుతాయి.

వాటిని అనుసరించి, ఎవరికి వారు సమయం సరి చూసుకోవాలి. 

వారములో ఏ రోజయినా రాహుకాలం గంటన్నర మాత్రమే వుంటుంది..

రాహుకాల  సమయపట్టిక:- 

సోమవారము   --   ఉదయం   --   7:30 నుండి 9:00 వరకు

మంగళవారం -- మధ్యాహ్నం  -- 3:00 నుండి 4:30 వరకు

బుధవారం   --  మధ్యాహ్నం  -- 12:00 నుండి 1:30 వరకు

గురువారం --   మధ్యాహ్నం  --  1:30 నుండి 3:00 వరకు

శుక్రవారము --  ఉదయం   --  10:30 నుండి 12:00 వరకు

శనివారము --   ఉదయం  --  9:00  నుండి 10:30 వరకు

ఆదివారం  --  సాయంత్రము -- 4:30 నుండి 06:00 వరకు 


ఇప్పుడు దీపారాధన చేసే విధానం ఎలాగో తెలుసుకుందాము. 

దీపారాధన అంటే అమ్మవారు అని అర్ధము. దీపపుకుంది లో త్రిమాతలు, శివుడు కొలువై వుంటారని పెద్దలు చెబుతారు.

దీపపుకుందిలోని అడుగుభాగాన సరస్వతి దేవి, మధ్యభాగాన లక్ష్మీ దేవి , పైభాగాన పార్వతి దేవి , కొనభాగాన శివుడు వుంటారని పెద్దల మాట. 

ఇందువలనే మన పూర్వికులు దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు.

ఏ పూజ చేసినా, చేయకపోయినా, రెండు పూటలా ( ఉదయం, సాయంత్రము ) దీపం వెలిగిస్తే చాలు ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని  పెద్దల మాట.

రాహుకాలం మొదలవగానే దీపం వెలిగించాలి. తరువాత పాలు, పండ్లు, పంచదార లేదా బెల్లం ముక్క ఏదో ఒకటి దీపం ముందు పెట్టి  త్రిమూర్తి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ప్రార్ధించాలి. 

అది ఏలాగంటే:

 " ఓం హ్రీం దుం దుర్గాయే నమః "  అని 108 సార్లు జపం చేసి నైవేద్యం పెట్టాలి.

తరువాత రాహుకాల సమయం అయిన వెంటనే ఒక పువ్వు తీసుకొని  దీప్పాని కొండ ఎక్కించాలి. 

ఈ విధముగా 41 రోజులు నిష్టగా చేసి, 42వ రోజు ఒక బ్రాహ్మణుడుకి  భోజనము పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించండి 

మనసు పెట్టి ప్రార్దిస్తే చాలు, ఆ తల్లి చల్లగా కాపాడుతుంది. 

ఆ తరువాత ఏ పని చేసిన ఆటంకాలు లేకుండా, కష్టాలు  తొలిగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

" త్రిమూర్తి శక్తీ సంభూత, శ్రీవిధ్యా మంత్ర మాతృక  శ్రీ చక్రమధ్యనిలయధ్యాయే ముకాంబికాం సదా ! " 

ఓం నమః శివాయః 



   

     

Previous
Next Post »

2 Comments

Click here for Comments
Ram
admin
29 ఆగస్టు, 2020 9:20 PMకి ×

Eni vathulu veliginchali ok deepam lo

Reply
avatar
Latha
admin
30 ఆగస్టు, 2020 2:47 PMకి ×

రెండు వత్తులు వేసి నువులనూనె పొసి వెలిగించాలి.

Reply
avatar