గ్రహదోషాల గురించి అందరూ విని ఉంటారు. అవి తొలగించుకోవటానికి రకరకాల పూజలు చేస్తుంటారు. వాటిలో ముఖ్యమయినది రాహుకాల దోషం.
ఈ రాహుకాల దోషం తొలగిపోవటానికి నాకు తెలసిన ఒక పద్ధతిని మీకందరికీ తెలియజేస్తున్నాను.
ఇది 41 రోజులు చేయవలసిన దీపారాధన. దీనిని రాహుకాల సమయంలో చెయ్యాలి. దీనిని " రాహుకాల దీపారాధన " అంటారు.
రాహుకాల సమయం ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కో రోజు ఒక్కో సమయంలో ఉంటుంది. ఆ సమయాలను అనుసరించి దీపారాధన చేయాలి.
అదీగాక ఇంటి గడియారాలలో సమయం ఒక్కో ఇంట్లో ఒక్కో విధముగా ఉంటుంది. కొన్ని గడియారములు ఫాస్ట్ గా, కొన్ని స్లోగా తిరుగుతాయి.
వాటిని అనుసరించి, ఎవరికి వారు సమయం సరి చూసుకోవాలి.
వారములో ఏ రోజయినా రాహుకాలం గంటన్నర మాత్రమే వుంటుంది..
రాహుకాల సమయపట్టిక:-
సోమవారము -- ఉదయం -- 7:30 నుండి 9:00 వరకు
మంగళవారం -- మధ్యాహ్నం -- 3:00 నుండి 4:30 వరకు
బుధవారం -- మధ్యాహ్నం -- 12:00 నుండి 1:30 వరకు
గురువారం -- మధ్యాహ్నం -- 1:30 నుండి 3:00 వరకు
శుక్రవారము -- ఉదయం -- 10:30 నుండి 12:00 వరకు
శనివారము -- ఉదయం -- 9:00 నుండి 10:30 వరకు
ఆదివారం -- సాయంత్రము -- 4:30 నుండి 06:00 వరకు
ఇప్పుడు దీపారాధన చేసే విధానం ఎలాగో తెలుసుకుందాము.
దీపారాధన అంటే అమ్మవారు అని అర్ధము. దీపపుకుంది లో త్రిమాతలు, శివుడు కొలువై వుంటారని పెద్దలు చెబుతారు.
దీపపుకుందిలోని అడుగుభాగాన సరస్వతి దేవి, మధ్యభాగాన లక్ష్మీ దేవి , పైభాగాన పార్వతి దేవి , కొనభాగాన శివుడు వుంటారని పెద్దల మాట.
ఇందువలనే మన పూర్వికులు దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు.
ఏ పూజ చేసినా, చేయకపోయినా, రెండు పూటలా ( ఉదయం, సాయంత్రము ) దీపం వెలిగిస్తే చాలు ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దల మాట.
రాహుకాలం మొదలవగానే దీపం వెలిగించాలి. తరువాత పాలు, పండ్లు, పంచదార లేదా బెల్లం ముక్క ఏదో ఒకటి దీపం ముందు పెట్టి త్రిమూర్తి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ప్రార్ధించాలి.
అది ఏలాగంటే:
" ఓం హ్రీం దుం దుర్గాయే నమః " అని 108 సార్లు జపం చేసి నైవేద్యం పెట్టాలి.
తరువాత రాహుకాల సమయం అయిన వెంటనే ఒక పువ్వు తీసుకొని దీప్పాని కొండ ఎక్కించాలి.
ఈ విధముగా 41 రోజులు నిష్టగా చేసి, 42వ రోజు ఒక బ్రాహ్మణుడుకి భోజనము పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించండి
మనసు పెట్టి ప్రార్దిస్తే చాలు, ఆ తల్లి చల్లగా కాపాడుతుంది.
ఆ తరువాత ఏ పని చేసిన ఆటంకాలు లేకుండా, కష్టాలు తొలిగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
" త్రిమూర్తి శక్తీ సంభూత, శ్రీవిధ్యా మంత్ర మాతృక శ్రీ చక్రమధ్యనిలయధ్యాయే ముకాంబికాం సదా ! "
ఓం నమః శివాయః
2 Comments
Click here for CommentsEni vathulu veliginchali ok deepam lo
Replyరెండు వత్తులు వేసి నువులనూనె పొసి వెలిగించాలి.
ReplyConversionConversion EmoticonEmoticon