గోంగూర పండు మిరపకాయ పచ్చడి

గోంగూర పండు మిరపకాయ పచ్చడి


కావలసిన పదార్థాలు

పండు మిరపకాయలు - ఒక కేజీ (హైబ్రిడ్ కాయలు)

ఉప్పు-  2  గిద్దలు  (కళ్ళు ఉప్పు)
మెంతి పిండి - ఐదు టీస్పూన్లు. 
గోంగూర కట్టలు - 12 కట్టలు (మంచి గోంగూర) 


చేయువిధానము:-  ముందుగా పండు మిరపకాయలు తీసుకొని, వాటిని శుభ్రంగా తుడిచి, తొడిమెలు తీసివేసి రోటిలో వేసి మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి.  దంచుకునే  వీలు లేకపోతే మిక్సీలో, వేసి మరీ ఎక్కువగా మెదగకుండా    చూసుకొని  మిక్సీ ఆపుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు కూడా కలుపుకొని తీసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి.





 తర్వాత గోంగూర కట్టలు తీసుకొని మొత్తం ఒలుచుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బేసిన్లోకి  నీరు తీసుకుని అందులోకి గుప్పెడు కళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి ఒలిచీ ఉంచుకున్న గోంగూరను అందులో వేసి అరగంట నాననివ్వాలి. అందులో ఉన్న మట్టి అంతా శుబ్రముగా పోతుంది. తర్వాత గోంగూర ను నీటిలో  నుంచి తీసి చిల్లుల పళ్ళెంలో వేసి ఒక అరగంట నీరంతా కారిపోతుంది. తరువాత ఆ గోంగూరను, మంచి పొడి క్లాత్ మీద వేసి ఒక రోజంతా ఆరనివ్వాలి *(ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి ) మరసటి రోజు ఆ గోంగూరను ఒక బాండీలో వేసి వేయించాలి. 



తరువాత ఒక పూట మళ్ళీ క్లాత్ మీద వేసి ఆరనివ్వాలి.  తర్వాత రోలు, పచ్చడి బండ శుభ్రముగా చేసుకొని, ముందుగా నూరి ఉంచుకున్న పండు మిరపకాయల కారాన్ని రోట్లో వేసి, అందులో వేయించి ఉంచుకున్న గోంగూరను వేసి బాగా కలిసేలా దంచుకోవాలి. తర్వాత అందులో మెంతిపిండి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. మూడు రోజుల తర్వాత మరల ఆ గొంగురను  రోట్లో వేసి మరల తిరగ తొక్కి ఉప్పుచూసుకోండి. చాలకపోతే కొంచెం కూడా వేసి దంచుకోండి. వేడి అన్నంలో వేసి, నెయ్యి కూడా వేసుకొని ఆరగించండి. మొత్తం పచ్చడి ఒక డబ్బా లోకి తీసుకొని, మీకు  కావలసినప్పుడల్లా కొంచెం మెత్తగా నూరుకొండి. ఇది ఎప్పుడు మీరు తిని ఉండరు. ఈ  పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఎఱుపు తగ్గకుండా పచ్చడి పాడవకుండా ఉంటుంది. పూర్వ రోజుల్లో  పెద్ద జాడీల్లో పెట్టేవారు. ఆ రోజుల్లో హైబ్రిడ్, అని, నాటు అని  వేరు వేరుగా ఉండేవి కాదు. అంతా ఒకటే . 

ఆరగించి,  ఆనందించి కామెంట్ పెట్టండి...




Previous
Next Post »