గోంగూర పులుసు కూర

గోంగూర పులుసు కూర 

కావలసిన వస్తువులు 

గోంగూర కట్ట -1
ఉల్లిపాయ -ఒకటి 
పచ్చిమిర్చి- 3
కొత్తిమీర - నాలుగు రెమ్మలు
నూనె - మూడు టీస్పూన్లు 
మినప్పప్పు-  ఒక టీస్పూను 
ఆవాలు - ఒక టీస్పూను 
మెంతులు నాలుగు గింజలు 
జీలకర్ర అర టీ స్పూను 
ఎండుమిర్చి ఒకటి
ఉప్పు తగినంత
కారం తగినంత 

తయారు చేయి విధానము:-  ఒక కట్ట గోంగూర తీసుకొని, ఒక బకెట్ లో నీళ్ళు పోసి, కొంచెం కల్లు ఉప్పు వేసి, అందులో గోంగూర కట్టను వేసి 10 నిమిషాలు ఉంచవలెను. పది నిమిషాలు అయిన తరువాత కట్టను తీసుకొని నీళ్లు బాగా విదిలించి తీసుకొని, కాడ లుంచి ఆకులను వలిచీ ఒక గిన్నెలో కి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసి అందులో గోంగూర   తరిగి  పెట్టాలి. తరువాత గిన్నెను కుక్కర్ లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. తర్వాత స్టవ్ కట్టేసి, ఒక పెద్ద  ఉల్లిపాయ, మూడు మిర్చి తరిగి పెట్టుకోవాలి. రెండు రెబ్బల కొత్తిమీరను కూడా బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ నుంచి గోంగూర తీసుకొని గరిటెతో బాగా మెదిపి ఉంచుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ౩ టీ స్పూన్ల నూనే వేసుకొని, అందులో ఆవాలు, పచ్చిపప్పు, పొట్టు మినప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వేసి బాగా వేయించాలి. వేగిన తరువాత అందులో కి తరిగి ఉంచుకున్నఉల్లిపాయ , పచ్చిమిర్చి వేసి బాగా  వేగనివ్వాలి.  వేగిన తరువాత మెదిపి ఉంచుకున్న గోంగూరను అందులో వేయాలి. తరువాత దానికి సరిపడ ఉప్పు, పసుపు, కారం ,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి  బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై లో ఉంచి  ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు సరి  చూసుకొని దించండి. చాలా చాలా సూపర్, ఉత్త పప్పులోకి చాల   బావుంటుంది. ఈ గోంగూర పులుసు  మరుసటి రోజు ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం. వేడివేడి అన్నం, ముద్ద పప్పు, గోంగూర పులుసు మంచి కాంబినేషన్, మరువలేని రుచి.




 


Previous
Next Post »