సుఖ సంతోషాలతో తులతూగాలంటే ...........

                కుటుంబం సకల సౌకర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలంటే ఇంటి ఇల్లాలు ఈ విధముగా చేయాలి. ఇల్లాలు అంటే గృహ లక్ష్మీయే కదా.  అది ఏ విధముగా చేయాలంటే, ఇల్లాలు  బ్రహ్మముహూర్తములో లేచి చెయవలసిన పనులు ఇవి. 
దానికి కావలిసినది ఒక చెక్క పీట తీసుకొని దాని మీద నాము గడ్డతో ముగ్గు వేయాలి.  అది ఎలాగంటే, పీటను శుభ్రముగా కడిగి తుడిచి ఆరనివ్వాలి,  తరువాత చిన్న కప్పులో కొంచం నాముగడ్డ వేసి అది కలిసేలా నీరు పోసి , కొంచెం దూది తీసుకొని నాములో ముంచి ముగ్గు వెయ్యాలి.  ఆ ముగ్గుని  అష్ట దిక్కుల ముగ్గు (లేదా) అష్ట దళ పద్మం అంటారు. 

       `

 

పీట మీద ఇలా ముగ్గు వేసిన తరువాత పసుపు కుంకుమలతో  అలంకరించుకోవాలి. 

మరుసటి రోజు బ్రహ్మముహూర్తములో లేచి తలస్నానము చేసి పూజ గదిలో ఆ పీట వుంచి దాని మధ్యలో దీపపు కుంది  వుంచి, రెండు వత్తులు వేసి  వెలిగించాలి.  దీపపు కుందికి గంధం, కుంకుమ పెట్టాలి.  దీపపు వత్తి తూర్పు ముఖం కాని, ఉత్తర ముఖం కాని చూసేలా ఉండాలి.  ఇప్పుడు మనస్సులో  మన ఇష్ట దేవతలని స్మరించుకోవాలి. అందులో మొదటగా విఘ్నేశ్వరుడుని తలుచుకోవాలి, చివరిలో ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి. తరువాత నవగ్రహా దేవతలని, పితృదేవతలని కూడా స్మరించుకోవాలి. అప్పుడే అనుకున్న పనులు ఏ ఆటంకము లేకుండా నెరవేరుతాయి.  తరువాత " ఓం  గం గణపతయే నమః " అని  108 సార్లు జపం చేయాలి.         

మనము ఉదయాన్నే కాఫీ కోసం పాలు కాచుకుంటాము. ఆ నిండు పాల గిన్నెలో చిటికెడు పంచదార వేసి ఆ దీపారాధన ముందు పెట్టి " అన్యధా శరణం నాస్తీ,త్వమేవ శరణం మమ " అని నమస్కారం చేసి, బొట్టు పెట్టుకునే వేలిని పాలలో ముంచి దీపారాధన కుందికి మూడు సార్లు పెట్టాలి. అంతే... తరువాత మీ దినచర్యను ప్రారంభించండీ. 

దీని వల్ల మీ మనసు, శరీరం, ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. 
రెండు మూడు రోజుల్లోనే మీలో, మీ కుటుంబంలో ఎంతో తేడా మీకే తెలుస్తుంది.  మీ గృహములో లక్ష్మీ తాండవిస్తుంది.  మీరు ఆయురారోగ్యాలతో తులతూగుతారు. 

సర్వేజనా సుఖినో భవంతు !!!!!

Oldest

2 Comments

Click here for Comments
Unknown
admin
23 ఆగస్టు, 2020 9:02 PMకి ×

మంచి విషయాలు చెప్పారు.

Reply
avatar
Latha
admin
30 ఆగస్టు, 2020 2:48 PMకి ×

ధన్యవాదములు

Reply
avatar