కళ్ళుచెదిరిపోయేలా జుట్టు పెరగడం కోసం...

 

చిట్కాలు:- 

కళ్ళుచెదిరిపోయేలా జుట్టు పెరగడం కోసం

             చాలా మందికి జుట్టు రాలటం, పల్చ బడటం లేకుండా ఒత్తుగా పెరగడానికి ఎవరూ ఇంతకు ముందు చెయ్యని వైద్యం ఇది. 

రేపు తల స్నానం చేయాలి అనుకుంటే ఈ రోజు ఒక కొబ్బరికాయని తీసుకొని, దానికి వున్న కొబ్బరి పీచుని తీసివేయాలి, కొబ్బరి పీచు తెసివేస్తే అక్కడ మూడు కళ్ళు వుంటాయీ, వాటిలో ఒక దానికి రంద్రం పెట్టాలి, ఎవరికీ వాళ్ళు వాళ్ళ జుట్టుని అనుసరించి మెంతులు తీసుకొని ఆ రంద్రం గుండా కొబ్బరికాయ లోనికి వెయ్యాలి, ఆ తరువాత ఒక కాగితం ముక్క గాని , గుడ్డ ముక్క తీసుకొని ఆ రంద్రానికి అడ్డం పెట్టి కొబ్బరికాయని కదలకుండా ఉంచాలి. ఆ మరుసటి రోజు కొబ్బరికాయ కి వున్న కాగితం లేదా గుడ్డ ముక్కని తీసి వేసి, ఆ కొబ్బరి నీటిని ఒక గిన్నెలోకి వొంపుకోవాలి, తరువాత కాయను పగలకొట్టి అందులోని నానిన మెంతులను, గిన్నెలోకి వొంపుకున్న కొబ్బరి నీరు, రెండు కలపి మెత్తగా పేస్టు లాగ చేసుకొని తలకు పట్టించుకోవాలి. ఒక గంట సేపు అయిన తరువాత కుంకుడు రసం తో తల స్నానం చేయాలి. మరుసటి రోజు ఆ కొబ్బరిచిప్ప లోని కొబ్బరి తీసి, దాన్ని కూడా పేస్టు లాగ చేసి జల్లెడలో వేసి కొబ్బరి పాలు తీయాలి.  దీనిలో నీరు కలప గూడదు, ఈ కొబ్బరి పాలను బాగా తలకు పట్టించాలి. ఒక గంట అయిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. 


ఈ విధముగా రెండు లేక మూడు వారాలు చేసిన తరువాత మీ జుట్టు ని చూసి ఆశ్చర్య పోతారు. 

ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి....



Previous
Next Post »