శివరాత్రి - కోటప్పకొండ తిరునాళ్ళ

 


ఈనెల మార్చి 11 వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం ఆ పరమేశ్వరుని నామ స్మరణమే ముక్తిదాయకం.  గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నది " కోటప్పకొండ ".  ఎల్లమంద,  కొండకావూరు మధ్య ఉన్న పర్వతాన్ని " త్రికూటచలం " అని, కోటప్పకొండ అని పిలుస్తారు. ఈ కొండ ఎత్తు ఐదు లేక ఆరు వందల అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. మనం తల పైకెత్తి ఈ కొండను ఎలా చూసినా మూడు ముఖములుగా కనిపిస్తుంది.  ఈ మూడు శిఖరములు బ్రహ్మ, విష్ణువు  మహేశ్వరులని పెద్దల ఉవాచ.



దక్షయజ్ఞం తర్వాత శివుడు వటువు వేషములో మధ్య శిఖరం మీద ఒక వటవృక్షం కింద జ్ఞాన ముద్రలో దర్శనమిస్తాడు అలా దర్శనమిచ్చేది పాత కోటప్పకొండ గుడి. పై మూడు శిఖరములలో జ్యోతిమయమైన లింగాలున్నాయి అంటారు పెద్దలు. కొండ పైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం కలదు. మధ్య కొండమీద పాత కోటేశ్వరస్వామి లింగం కలదు. కొత్త గుడి దక్షిణదిక్కున వినాయకుడి గుడి, పశ్చిమ వైపున  సాలంకేశ్వర గుడి, ఉత్తరము వైపున సంతాన భాగ్యానికి  ప్రసాదించే కోటేశ్వరస్వామి గుడి,  ఎడమవైపున బిల్వ వృక్షం కలదు.  దాని కింద "మార్కండేయ శివలింగము", తూర్పువైపున నందికేశ్వరుడు ఉంటారు. ప్రస్తుతము మెట్ల మార్గం దగ్గర ఒక లింగము కలదు. అక్కడ మొక్కులు తీర్చుకుంటారు.



పూర్వరోజుల్లో బొచ్చు కోటయ్య అని కూడా అంటారు. కొండపైన స్వామి దర్శనమునకు ముందుగా "గొల్లభామ" గుడి కలదు. ఈ గుడిలో ఎప్పుడూ అఖండ దీపారాధన జరుగుతూ ఉంటుంది. మన దేశంలోని జ్యోతిర్లింగ దేవాలయాల్లో శివరాత్రి చాలా గొప్పగా జరుగుతుంది. అరుణాచలంలో జ్యోతిర్లింగము, కంచిలో పృథ్విలింగం, జంబుకేశ్వరంలోజలలింగము, కాళహస్తిలో వాయులింగము, చిదంబరంలో ఆకాశలింగము కలవు.



 ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయి. దీనికి "కోటప్పకొండ తిరునాళ్ల"గా ప్రసిద్ధి. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వెదురు కర్రలతో  ప్రభలను కట్టుకొని, కరెంటు దీపాలతో అలంకరించుకుని రావడానికి ఇరవై రోజుల ముందుగానే తయారవుతారు. చేదుకోకోటయ్య, చేదుకును మమ్మేలుకోవయ్యా అంటూ భక్తి పారవశ్యంతో మెట్ల మార్గం ద్వారా ఆ స్వామి దర్శనం చేసుకుంటారు. ఊరేగింపులు, ప్రభలు, ఎడ్ల పందెములు, కోలాటాలు వంటి ఆటపాటలతో కుల,మత,భాషా, బేధాలు లేకుండా ఆనందంగా రాత్రంతా జాగారం చేస్తారు. పశుసంపద ఉన్నవారు వాటిని తోలుకుని కొండచుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.



మహాశివరాత్రి మహాదేవునికి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ చతుర్దశి రోజున వస్తుంది. శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేసి స్వామి అనుగ్రహం పొందుతారు. మనసు ఆ స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తే సర్వపాపాలు తొలగిపోయి  ఇహ పర సుఖములు పొందుతారు.



అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు !!

ఓం నమః శివాయ నమః

Previous
Next Post »

1 Comments:

Click here for Comments
Unknown
admin
10 మార్చి, 2021 9:13 PMకి ×

రికార్డింగ్ డాన్సులు కూడా ఉంటాయి

Congrats bro Unknown you got PERTAMAX...! hehehehe...
Reply
avatar