మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలిచి ఉండాలంటే... కర్పూరంతో ఇలా చేయండి..!

 

మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలిచి ఉండాలంటే... కర్పూరంతో ఇలా చేయండి..!


డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి! డబ్బు సంపాదించటానికి నానా తంటాలూ పడుతుంటాం. ఎందుకంటే, తెల్లారి లేస్తే ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాలి కాబట్టి. అయితే, కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. ఇక మరికొంతమందికి వారు సంపాదించిన డబ్బు చేతికి అందే సమయానికి ఏదో అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంది. ఇలా అనేక కారణాలవల్ల డబ్బు చేతిలో నిలబడదు. మరి అలాంటి సమస్యతో సతమతమయ్యేవారు ఏం చెయ్యాలో తోచక జ్యోతిష్కులను నమ్మటమో… పూజలు, పునస్కారాలు చేయటమో… లేదంటే దానాలు, ధర్మాలు చేయటమో వంటివి చేస్తుంటారు. కానీ, ఇవేమీ అవసరం లేదు. నిత్యం మన పూజగదిలో వాడే కర్పూరం ఉపయోగించి… మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలిచి ఉండేలా చేయొచ్చు. 


సనాతాన ధర్మంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి శుభకార్యానికైనా కర్పూరం తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఇక కర్పూరం లేకుండా పూజ పూర్తి కాదు. అంతేకాదు, కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలని కూడా తొలగిస్తుంది. దీన్ని ఉపయోగిస్తే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే, తంత్రశాస్త్రం ప్రకారం చూస్తే, కర్పూరంతో చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కర్పూరం వల్ల ఇంట్లో సుఖ  సంతోషాలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం  కలుగుతుంది. మరి అలాంటి ఈ కర్పూరంలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా…


  • రాత్రి వంటగదిలో పనంతా పూర్తయిన తర్వాత లవంగాలు, కర్పూరం కలిపి… ఒక వెండి గిన్నెలో వేసి వెలిగించండి. ఇలా మీరు ప్రతిరోజూ చేస్తే, మీ జీవితంలో ధన, ధాన్యాలకి ఎప్పుడూ కొరత ఉండదు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధనలక్ష్మి తాండవిస్తుంది.

  • రోజూ ఉదయాన్నే ఒక గులాబీ పువ్వుని తీసుకొని, అందులో ఒక చిన్న కర్పూరం ముక్క వేసి ఉంచండి. తర్వాత సాయంత్రం ఆ పువ్వుని దుర్గాదేవికి అర్పించండి. ఇలా చేయటంవల్ల మీకు ఆకస్మిక డబ్బు అందుతుంది. అలాగే, అనివార్య కారణాల వల్ల మీకేదైనా డబ్బు ఆగిపోయినట్లయితే... అది కూడా పొందుతారు. అయితే, కనీసం 43 రోజులపాటు ఈ విధంగా చేయాలి. నవరాత్రి సమయంలో మీరు ఈ పని చేస్తే, మరింత సానుకూల ప్రభావాలని చూస్తారు.

  • ఎప్పుడైనా మీకేదైనా ప్రమాదం జరిగినా...లేదా ప్రమాదానికి భయపడినా... ఆరోజు రాత్రి హనుమాన్ చలీసాను పారాయణం చేసి... కర్పూరం వెలిగించాలి. ఏదేమైనా, కర్పూరం ఉదయం మరియు సాయంత్రం వెలిగించే ఇంట్లో, ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరిగే అవకాశము ఉండదు. 

  • ఇంట్లో ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో కర్పూరం వేసి, నానబెట్టి, దాని సువాసనని ఇల్లంతా వ్యాప్తి చెందేలా చూడండి. ఇలా చేయడం ద్వారా, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఏర్పడుతుంది. దీని వల్ల ఎల్లప్పుడూ ఇంట్లో ఆనందం మరియు శాంతికి దారితీస్తుంది.

  • రోజూ కర్పూరం వెలిగించి, దాని వాసనని పీల్చడం ద్వారా, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లు వంటివి నాశనం చేసి, పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఎలాంటి వ్యాధులూ మన దరిచేరవు కూడా. 

ఫ్రెండ్స్! విన్నారు కదా! ఇంత సులభమయన విషయాన్ని వదిలిపెట్టి, ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ మీ డబ్బుని, సమయాన్ని వృద్దా చేసుకోకుండా… ఇప్పుడే ఈ పద్ధతిని పాటించండి ఇక వద్దన్నా... మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలిచే ఉంటుంది. 

ఈ వారమునుండి నాకు తెలిసిన సులభమైన చిట్కాలు

మీకు తెలియపరుస్తూ ఉంటాను.

కళ్ళుచెదిరిపోయేలా జుట్టు పెరగడం కోసం


Previous
Next Post »