తిరుచందూర్ స్థల పురాణము

  


  పూర్వం వీరమహేంద్రపురాన్నీ శూరపద్మన్  అనే రాక్షసరాజు  పరిపాలించేవాడు.  ఆ వీర మహేంద్రపురం " చందూర్ " అనే సముద్రం మధ్యలో ఉన్న అందమైన నగరం. ఆ నగరం బయటివారికి కనిపించకుండా  క్రౌంచ పర్వతం అడ్డుగా నిలుస్తుంది.  ఆ క్రౌంచ పర్వతం మీద తారకాసురుడు అనే రాక్షసుడు  నివసిస్తూ ఉన్నాడు.  శూరపద్మడు కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, ఒక కొడుకు ఉన్నారు.  శూరపద్మన్  ఒక సారి శివుని గురించి ఘోర తప్పసు చేయనారంబించాడు.  అతని ఘోర తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయి ఏ వరము కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శూరపద్మన్  తనకు శివ శక్తీ చేత తప్ప  ఇంక దేని చేతను మరణము లేకుండా వుండాలని వరము అడిగాడు. శివుడు అందుకు అంగీకరించి అతను అడిగిన వరమును ప్రసాదించాడు.  

ఆ వర ప్రభావము వలన శూరపద్మడు విర్ర వీగి దేవతలని, మునులును, ప్రజలను హింసించసాగాడు.  అతని హింసలు భరించలేక , బ్రహ్మ , విష్ణువు మిగతా అందరు దేవతలు, మునులు అందరు కలసి, కైలాసానికి వెళ్లి పరమశివుడితో తమ బాధలు తీర్చమని మొర పెట్టుకున్నారు.

అప్పుడు శివుడు మీరు చింతించవలదు, త్వరలోనే మీ కష్టాలు తీరుతాయి.  దిగులు మాని ప్రశాంతముగా మీ మీ నివాసాలకు వెళ్ళండి. త్వరలో మీ కష్టాలు తీరుతాయి అని అభయమిచ్చాడు. 

వాళ్ళంతా ఆ మంచి రోజులు ఎప్పుడూ వస్తాయి అని అనుకుంటూ వాళ్ళ వాళ్ళ నివాసాలకు  వెళ్ళారు.  నారదుడు మాత్రం అక్కడే నిలబడి పరమేశ్వరుడుని చూసి స్వామి, మీ ఉద్దేశం ఏమిటో నాకు వివరించి చెప్పండి అని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో   " నారద ! నీవు లోకసంచారివి , నీకు తెలియని విషయం వుందా అని అడిగాడు లేదు స్వామి నాకు అవగతము అవటము లేదు, అందుకనే అడిగాను స్వామి, అన్నాడు. నారద !  " మురుగన్ " అంటే ఎవరు , నా శక్తి ద్వార జన్మించినవాడు కదా ?  

ఆ కద చెపుతాను విను అని ఇట్లు కథ చెప్ప తోడంగే.   శూరపద్మడుకి  వరం ఇచ్చింది  నేనే కదా ? అందుకనే నేను శక్తివంతమైన  రేతస్సు అగ్నిగుండములో వదిలాను. నా రేతస్సు అగ్ని హోత్రునికి భరించడం బాధాకరముగ పరిణమించేను . అగ్నిఆ వేడిని భరించలేక శివుని ప్రార్దించగా " నా రేతస్సు ఒకా నొక కారణమున ఒక యువతి గర్భమున జేరును. దీనికి  విచారించవలసినపని లేదు అని శివుడు అగ్నితో పలికెను.  అగ్ని దేవుడి భార్య యగు స్వాహా   ఆరుపర్యాయములు వేరు వేరుగ ముని  పత్నుల   రూపములను దాల్చి అగ్ని దేవుని కలియుటచే ,  శివుని రేతస్సు ఆరు రూపములు గా స్వాహా దేవి యందు ఇమిడిపోయినది. స్వాహా దేవి కూడా  ఆ వేడిని భరింపజాలక ఆ రేతస్సు కైలాసము లోని ఒక శిఖరమునందు వదిలి వేసేను. కైలాస శిఖరము నుండి గాలి వేగమునకు ఆకాశగంగ యందు చేరెను. మందాకిని కూడ ఆ వేడి భరింపజాలక ప్రవాహ రూపములో ఆరు పాయలుగా చీలీ రెల్లు యందు పడ వైచేను.  రెల్లు గడ్డిని శరము అని కూడ అంటారు.  రెల్లు గడ్డి యందు కుమారస్వామి , మార్గశిరమాసమున, శుద్ధ షష్ఠి తిధి యందు ధనిష్ట నక్షత్రమున తెల్లవారుజామున వృశ్చిక లగ్నమందు రెల్లు దుబ్బుల నుండి అరుణ కిరణ  కాంతుల తేజో రూపమును కలిగి ఆరు ముఖములతో, పండ్రెండు చేతులతో జన్మించెను.  ఇప్పుడు అర్ధము అయినదా నారదా, అని శివుడు  చిరునవ్వుతో వెడలిపోయే.  ఆ విధముగా జన్మించిన  కార్తికేయ పెరిగి పెద్ద వాడయీ సైన్యాధి పత్యము వహించాడు.




ఒక సారి శివుడు, పార్వతి ఇద్దరు కలసి శూరపద్ముడుకి కాలం సమీపించింది, ఇంక మురుగన్ పరాక్రమము  ప్రదర్శించే సమయం ఆసన్నమైంది అని, కుమారా, షణ్ముఖా అని పిలుస్తారు.  అప్పుడు శరవణన్ వారి చెంతకు వచ్చి నిలుస్తాడు. తండ్రి ఏమి ఆజ్ఞ సెలవివ్వండి, అని అడుగుతాడు.  కందా ! శూర సంహారానికి సమయం ఆసన్నమయింది. నీవు  బయలుదేరు , అని వీరబాహును, అతని సైన్యాన్నీ మురుగన్ కు తోడుగా వెళ్ళమంటాడు. తల్లి పార్వతి దేవి తన శక్తిని ఆయుధముగా చేసి మురుగన్ చేతిలో పెట్టి, ఈ శూలం నా శక్తి ఆయుధము.  నీవు ఎవరి మీద ప్రయోగించినా శత్రు సంహారము చేసి తిరిగి నీ చేతికి వస్తుంది. దీని వల్లనే శక్తివేలన్ అనే పేరు నిలుస్తుంది.  మీరు విజయంతో రండి అని ఆశీర్వదించి అని పంపిస్తారు, శివుడు, పార్వతి. 


వీరంతా చందురు అనే ప్రదేశములో యుద్ధానికి సిద్ధముగా వుండి, వీరబాహును, శూరపద్ముడి వద్దకు రాయబారిగా పంపుతాడు మురుగన్.  శూరుడు బంధించిన దేవతలనందరిని విడిచి పెట్టమని , లేని పక్షములో యుద్ధం తప్పదని చెప్పి పంపుతాడు. కాని శూరుడు సంధికి ఒప్పుకోక యుద్ధానికి సిద్ధ పడతాడు. కొన్ని రోజులు చందురు సముద్ర తీరము దగ్గర శూరుడు, మురుగన్  యుద్ధ పోరు కొనసాగించారు. యుద్ధ సమయములో శూరసేనుడు శక్తి సన్నగిల్లి పెద్ద వృక్షము లాగ మారిపోతాడు. ఇది తెలిసిన మురుగన్  తన తల్లి అయిన పార్వతి దేవి ఇచ్చిన  ఆయుధంతో ఆ చెట్టును రెండుగా చిల్చీ శూరసంహారము చేస్తాడు.  అప్పుడు శూరుడు " నేను శివ భక్తున్ని, అలాంటి నాకు ఎల్లప్పుడు నా పేరు చిరస్థాయిగా వుండేలా వరం అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు.  అప్పుడు మురుగన్ సంతోషించి రెండుగా చీలిన అతని శరీరంలో ఒక భాగాన్నీ నెమలి గాను, ఇంకొక భాగము కోడిపుంజుగా అయ్యేలా చేసి, నెమలిని తన వాహనముగా, కోడి పుంజును తన జెండా మీద వుండేలా అనుగ్రహిస్తాడు, శూరపద్ముడిని చంపిన ఆ ప్రదేశాన్ని ఈ రోజు నుంచీ " తిరుచందూరు " అనే పేరుతో పిలువబడుతుంది, అని స్వామి అనుగ్రహిస్తాడు. ఆ విధముగా శూరసంహారము జరిగి దేవతలంతా సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారు. 



చెన్నై నుంచి తిరుచందూరు కి ట్రైన్స్  మరియు బసు లు కలవు మదురై నుంచి 180 కి మీ మరియు కన్యాకుమారి నుంచి 90 కి మీ దూరంలో ఉంది. ఇది తూత్తుకుడి జిల్లాలో ఉంది.

ఈ గుడి సముద్రపు ఒడ్డున ఉన్నది. ఇక్కడ గుడిలో కొబ్బరికాయను పీచు తీసి కొడ్తారు. ఇక్కడ గురు గ్రహపూజలకు ప్రసిద్ధి .  మురుగన్ కి  వున్న ఆరు గుళ్ళలో ఇది  ఒకటీ. ఇది  చాలా ప్రసిద్ధమయిన పుణ్య క్షేత్రము. గురు గ్రహ దోషము వున్న వాళ్ళుఇక్కడ స్వామిదర్శనము చేసుకుంటే ఆ దోషము తొలగి పోతుందని పెద్దల ఉవాచ.



  ఒకానొకప్పుడు  బృహస్పతి ఇక్కడుకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నాడని, అందు చేత ఈ దోషము వున్నవారు ఈ స్వామిని దర్శించుకుంటే ఆ దోషము తొలగి పోతుందని పురాణాలు చెపుతున్నాయి.  స్వామి దర్శన మాత్రాన మన సమస్యలు , దోషాలు అన్ని తొలగిపోయి, మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు తప్పక కలుగుతాయి. మనః స్పూర్తిగా పిలిస్తే పలికే చల్లని దైవం. 

నమ్మిన వారికి కొండంత అండ నేనుండగా భయమెందుకు అని మనకి అండగా ఉంటాడు. 

" ఓం శరవణ భవ ఓం " 




Previous
Next Post »