ఈ టిఫిన్ నూనె లేకుండా ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించేది. ఇది బియ్యప్పిండితో చేసేది. ఇది పిల్లలకు కూడా ఏమీ చేయదు. ఆరోగ్యకరమైనది. పూర్వకాలంలో పిల్లలకు, పసిపిల్లలకు బియ్యం వేయించి ఉడకబెట్టి అన్నం పెట్టేవారు. అలా పెట్టడం వల్ల పిల్లలకి బాగా జీర్ణమవుతుంది. దీని పేరు పుట్టు అంటారు. ఎలా తయారు చేస్తారో మీకు తెలియపరుస్తాను. చిట్టి ప్రయత్నం చేసి చూడండి.
దీనికి కావలసిన పదార్థాలు:- బియ్యప్పిండి, కొబ్బరికాయ, సాల్ట్, తయారుచేసే గిన్నె.
ముందుగా మీకు కావాల్సినంత బియ్యాన్ని5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత చిల్లుల గిన్నెలో బియ్యాన్నివడకట్టుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తరువాత ఒక పేపర్ మీద ఒక గంట సేపు ఆరబెట్టాలి. తరవాత నానిన బియ్యాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టిన బియ్యాన్ని రవ్వ జల్లెడలో వేసి జల్లించుకోవాలి. రవ్వ జల్లెడలో అయితేనే పుట్టు
తయారు చేసుకోవడానికి బాగా కుదురుతుంది. పిండి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం బరకగా ఉండాలి. కొంచెం తడిగా కూడా ఉండాలి. ఇంక దీనిని వేయించుకోవాలి. స్టౌ వెలిగించి, బాగా మందంగా ఉన్న బాండి పెట్టుకుని పిండిని అందులో వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో ఉంచుకొని వేపాలి. కొంచం పిండి వేడెక్కిన తరువాత స్టవ్ "హై" లో ఉంచీ వేపాలి. పిండి అడుగంటకుండా ఉండేలా చూసుకోవాలి. పిండి మంచి వాసన వస్తుంది. తర్వాత స్టవ్ కట్టేసి పిండిని విశాలమైన పళ్ళెంలో వేసి ఆరబెట్టుకోవాలి. రేపు ఉదయాన్నే చేసుకోవాలి అనుకుంటే రాత్రి ఈ పిండి తయారు చేసుకుంటే ఉదయం చేసుకోవటం తేలికగా ఉంటుంది. సాయంత్రం చేయాలంటే ఉదయం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ అంతా చూస్తుంటే ఇంత శ్రమ పడాలి అనిపిస్తుంది. కానీ అలా అనుకోకుండా ప్రయత్నం చెయ్యండి. టేస్ట్ చూస్తే మీకు శ్రమ గుర్తుకు రాదు.
గొట్టానికి అడుగు, పైన భాగంలో కొబ్బరి వేయాలి. వేసిన తరువాత దాని మీద
మూత ఉంచి స్టవ్ హై లో ఉంచీ 20ని. ఉడికించుకోవాలి. తరువాత ఆ గొట్టాన్ని తీసి ఒక పళ్ళెంలో సర్వ చేసుకోండి ఇది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్.
దీనికి కూర:- దీనికి శెనగల కూర చాలా బాగుంటుంది. ఇది చేసే విధానం --
ఒక గ్లాసుడు నాటు శెనగల తీసుకొని 8 గంటలు నాన పెట్టుకోవాలి. ముందుగా శెనగలు నీరుపోసి బాగా కడిగి, ఆ నీరు వంపేసి మరల తగినంత నీరు పోసి, ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి. ఎనిమిది గంటల తరువాత దీనిని కుక్కర్లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. ఆ విజిల్ పోయే లోపు ఒక బాండి తీసుకొని అందులోరెండు చెంచాల ధనియాలు, ఐదు ఎండుమిర్చి (కారము ఎక్కువ కావాలంటే మిర్చి పెంచుకోవచ్చు) వేసి వేయించుకోవాలి. వేయించి పక్కన ఉంచుకోవాలి. అది చల్లారే లోపు కుక్కర్ విజిల్ తీసి చూస్తే శెనగలు చక్కగా ఉడికి ఉంటాయి. ఆ శెనగలు ఒక చిన్న కప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. శెనగలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి ధనియాలు ఎండుమిర్చి పచ్చికొబ్బరి తీసి ఉంచు కున్న శెనగలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో ఉన్న శెనగలు పొయ్యి మీద ఉంచి, మిక్సీ పట్టుకున్న కొబ్బరి ముద్దను అందులో వేసి బాగా కలిపి ఉడికించాలి. తరువాత ఉప్పు సరిపోయిందో ఏమో చూసుకోవాలి. శెనగలు కొంచెం లూజుగా ఉండేలాగా నీళ్ళు కలుపుకోవాలి. శెనగలు, గ్రేవీ బాగా కలిపి ఉడికిన తర్వాత, స్టౌ కట్టేసి అందులో కొంచెం కొబ్బరినూనె, కరివేపాకు వేసి దించుకోవాలి. అంతే రుచికరమైన శెనగల కూర (కడల కర్రీ) రెడీ. శెనగల్లో నీరు ఎక్కువగా పోయకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. లూజుగా ఉండటం అనేది ఎవరెవరి ఇష్టానుసారంగా ఉంటుంది. నేను రాసింది 40 సంవత్సరాల నాటిది. ఇప్పుడు చాలామంది ఈ కూర లో టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎవరి ఇష్టప్రకారం వాళ్లు వేస్తారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం.
పెసలు కూర:- కొంతమందేమో కారం లేకుండా బ్రేక్ఫాస్ట్ చేయాలనే ఉద్దేశంతో పెసలు,కూరగా చేస్తారు. అది ఎట్లా అంటే ఒక గ్లాసుడు నాటు పెసలు (పచ్చవి) తీసుకొని, రాళ్లు ఏమి లేకుండా శుభ్రం చేసుకొని, నీరుపోసి బాగా కడిగి నీరు, సరిపడా ఉప్పు వేసి ఒక గంట నాననివ్వాలి. తర్వాత కుక్కర్లో వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేలా చూసుకుని స్టవ్ కట్టేయాలి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మరి పేస్టులా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. దాంట్లో నీరు ఏమన్నాఉంటే నీరువంపి, చారులో ఏమన్నాకలుపుకోవచ్చు. నీరు (తడి) ఇంకెలా చూసుకొని దించేయాలి. ఇదీ పుట్టు, కలిపి తింటారు. అదొక రుచి. ఇంకొంతమంది ఒట్టి పుట్టు, అరటిపండు, అప్పడం నంచుకొని తింటారు. ఇంకొంత మంది పుట్టు, పంచదార కలిపి తింటారు. ఇది అంతా ఎవరి ఇష్టం వారిది. ఇది చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్ఫాస్ట్. ప్రయత్నించి చూడండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి.
గమనిక:- మీకు పుట్టు గిన్నె అందుబాటులో లేకపోతే ఒక టెంకాయ చిప్ప తీసుకొని (అడుగున కంత ఉన్న చిప్ప) దానికి అడుగున కొంచెం కొబ్బరి, తర్వాత పుట్టు పిండి, తర్వాత కొబ్బరి, ఇలా వేస్తూ నింపాలి( కొబ్బరి చిప్ప అప్పుడే తీసినదై ఉండాలి ) నింపిన తర్వాత కుక్కర్ లో నీరు పోసి మూత పెట్టాలి. ఆ నీరు బాగా తెర్లిన తర్వాత కుక్కర్ నాబ్ మీద విజిల్ పెట్టకుండా నాబ్ మీద టెంకాయ చిప్పకంత ఉండేలా పెట్టాలి. చిప్ప మీద మూత పెట్టి ఉంచి పదిహేను నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి అంతే పుట్టు రెడీ. ( టెంకాయ చిప్ప లో చేసే పుట్టుని " చెరట పుట్టు " అని అంటారు) కొబ్బరి చిప్ప మోడల్ లో గిన్నెలు కూడా దొరుకుతాయి. మరి 60 సంవత్సరాల క్రితం ఇలాగే చేసేవాళ్ళు. ముందు చెప్పినట్టు గిన్నె స్థానంలో బొంగు తో గొట్టాలు తయారుచేసి పుట్టు చేసుకునేవారు. ఎలా చేసినా దాని రుచి అమోఘం. ఈ కేరళ టిఫిను అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుట్టు పొడి బజార్లో రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది. నేనేమో అదే వాడుతున్నాను ప్రస్తుతము. ముందురోజు రాత్రి కడల కర్రీ (శెనగల కూర) కూడా చేసి ఫ్రిజ్ లో పెట్టుకొని, మరుసటి రోజు ఉదయాన్నే పిండి ప్రిపేర్ చేస్తాను. అది ఎలాగంటే ఒక గ్లాస్ పుట్టు పిండికి ముప్పాతిక గ్లాసు నీళ్లు సరిపడా ఉప్పు వేసి పిండిని కలిపి ఉంచుకోవాలి. ఒక అరగంట పిండిని నాననిచ్చిన తరువాత పిండి పుట్టు చేసుకునే విధంగా తయారవుతుంది. తరువాత పైన చెప్పిన విధంగా పిండి పెట్టుకుని పుట్టు తయారుచేసుకొని ఆరగించండి. నేను పిండి ప్యాకెట్, పుట్టు గిన్నె అన్ని బొమ్మలు పెడతాను. దాని పేరు డబల్ హార్స్ పుట్టు పొడి. మీకు దొరికితే అది వాడుకోండి. శ్రమ తగ్గుతుంది. రుచి మాత్రం ఆమోఘం.





ConversionConversion EmoticonEmoticon